Madhya Pradesh: లోన్‌లో ద్విచక్రవాహనం కొని... రూ.60,000 ఖర్చు చేసి డీజేతో ఇంటికి తెచ్చిన చాయ్ వ్యాపారి

Tea seller throws 60000 DJ party to celebrate purchase of moped in Madhya Pradesh

  • మధ్యప్రదేశ్ శివపురిలో ఘటన
  • రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో మోపెడ్ కొన్న టీ సెల్లర్ మురారి
  • డీజేతో మోపెడ్‌ను ఇంటికి తీసుకువచ్చిన మురారి
  • అందరికీ చూపించేందుకు జేసీబీతో పైకెత్తించిన వైనం

మధ్యప్రదేశ్‌లో ఓ ఛాయ్ దుకాణదారు కొత్త ద్విచక్ర వాహనాన్ని లోన్‌లో కొనుగోలు చేసి... కొత్త మోపెడ్ వచ్చినందుకు సంబరాలు చేసుకోవడానికి డీజే ఖర్చు కోసమే రూ.60,000 ఖర్చు చేశాడు. ద్విచక్రవాహనాన్ని ఇంటి వరకు తీసుకు రావడానికి ఈ డీజేను ఏర్పాటు చేశాడు. తాను కొనుగోలు చేసిన ద్విచక్రవాహనం అందరికీ కనిపించేందుకు గాను జేసీబీతో కూడా పైకెత్తించాడు. 

శివపురికి చెందిన టీ విక్రయదారు మురారీ లాల్ కుశ్వాహ ఇటీవల రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో ఓ మోపెడ్‌ను కొనుగోలు చేశాడు. మిగతా మొత్తం లోన్ తీసుకున్నాడు. తాను ద్విచక్రవాహనం కొనుగోలు చేయడాన్ని వేడుక చేసుకోవాలనుకున్నాడు. డీజేతో  ఊరేగింపుగా ఇంటికి తీసుకు వచ్చాడు.

ఆ మోపెడ్‌కు దండేశాడు. జేసీబీ సాయంతో పైకి ఎత్తించి అందరికీ చూపిస్తూ ఇంటికి తీసుకు వచ్చాడు. రూ.20 వేలు డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేసిన మోపెడ్‌కు రూ.60 వేలకు పైగా ఖర్చు చేసి సంబరాలతో ఇంటికి తీసుకువచ్చాడు. తన పిల్లల సంతోషం కోసమే ఇలా చేశానని అతను చెప్పాడు. 

మరోవైపు, డీజేతో సంబరాలు చేసుకోవడంపై స్థానిక పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర శబ్దకాలుష్యం చేశారంటూ కేసు నమోదు చేశారు. మురారితో పాటు డీజే ఆపరేటర్‌పై కూడా కేసు నమోదయింది. మురారి అంతకుముందు కూడా ఓసారి రూ.12,500 పెట్టి ఫోన్ కొనుగోలు చేసి, రూ.25,000తో వేడుకలు నిర్వహించాడు.

  • Loading...

More Telugu News