Telangana: క్యాట్ ఆదేశాలపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేసిన ఐఏఎస్‌లు.. మధ్యాహ్నం విచారణ

ias officers filed lunch motion petition in telangana high court on cat decission

  • క్యాట్‌లో ఐఏఎస్‌లకు చుక్కెదురు
  • క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌‌లు
  • పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు

తాము ప్రస్తుతం విధులు నిర్వహించే ప్రదేశంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించిన తెలంగాణ, ఏపీ ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైన విషయం తెలిసిందే. డీఓపీటీ ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్వాట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో క్వాట్ తీర్పును సవాల్ చేస్తూ నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రోనాల్డ్ రోస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనుంది. మరోపక్క, కేంద్ర ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రేవంత్ సర్కార్ రిలీవ్ చేసింది. నాలుగు రోజుల క్రితమే అందరినీ రిలీవ్ చేసినట్లు ఉత్తర్వులలో పేర్కొంది. డీఓపీటీ ఆదేశాల ప్రకారమే రిలీవ్ చేసినట్లు తెలిపింది. తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసిన వారిలో ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రాస్, సృజన ఉన్నారు. 

అలాగే ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ కు చెందిన అధికారులు అనంతరాము, రావత్, హరికిరణ్, సృజన, శివశంకర్‌లను ప్రభుత్వం రిలీవ్ చేసింది. దీంతో వీరంతా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆయా ప్రాంతాల్లో రిపోర్టు చేస్తారా .. హైకోర్టు తీర్పు ఏమి చెబుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో తెలంగాణలో పని చేసిన సీఎస్ సోమేశ్ కుమార్‌ను కూడా ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆయన ఏపీలో రిపోర్టు చేసి స్వచ్చంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు.    
 

  • Loading...

More Telugu News