Movie News: పుష్ప-2 చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చిన బ్రహ్మాజీ!
- సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ ఫొటో పంచుకున్న నటుడు బ్రహ్మాజీ
- ఫొటోలో బ్రహ్మాజీ, సుకుమార్, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌తో పాటు ‘యానిమల్’ మూవీ ఫేమ్ సౌరభ్ సచ్ దేవ
- సోషల్ మీడియాలో ఫొటో వైరల్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2కు సంబంధించి నటుడు బ్రహ్మాజీ ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు. చిత్రంలో తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ బ్రహ్మాజీ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో బ్రహ్మాజీ, సుకుమార్, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌తో పాటు ‘యానిమల్’ మూవీ ఫేమ్ సౌరభ్ సచ్ దేవ కనిపించారు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్‌లు, సినీ అభిమానులు ‘సుకుమార్ భారీగానే ప్లాన్ చేస్తున్నారు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చిత్రంలో ‘యానిమల్’ మూవీ ఫేమ్ సౌరభ్ సచ్ దేవ కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పుష్ప పార్ట్ 1 మంచి విజయం సాధించడం, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో పార్ట్ 2పై అంచనాలు తార స్థాయికి చేరాయి. దాంతో పుష్ప 2 కథకు మరిన్ని హంగులు జోడించి సుకుమార్ తీర్చిదిద్దుతున్నారు. డిసెంబర్ 6న మూవీ విడుదల కానుందని గుర్తు చేస్తూ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “పుష్ప: ది రూల్ ఫస్ట్ షో ఎక్కడ చూడబోతున్నారు?” అంటూ అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసింది.