Ananya Nagalla: హీరోయిన్‌లు కమిట్‌మెంట్‌ ఇస్తే ఒక పారితోషికం, లేకపోతే మరో పారితోషికం ఉంటుందా?అనన్య నాగళ్లకు జర్నలిస్ట్‌ ప్రశ్న

if the heroines give a commitment will there be one reward if not another reward Journalists question to Ananya Nagalla
  • పొట్టేల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో జర్నలిస్ట్‌ ప్రశ్న 
  • అనన్య నాగళ్ల హీరోయిన్‌గా పొట్టేల్‌ సినిమా 
  • సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమతో పాటు, ఇతర సినీ పరిశ్రమలో కూడా హాట్‌టాపిక్‌గా మారిన అంశం క్యాస్టింగ్‌ కౌచ్‌. ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి పలువురు హీరోయిన్లు, ఇతర నటీమణులు కూడా తమ అభిప్రాయాలను, సినిమా పరిశ్రమలో తాము ఎదుర్కొన్న అనుభవాల గురించి బహిరంగంగానే వెల్లడించారు. అయితే తాజాగా జరిగిన పొట్టేల్‌ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరోయిన్‌ అనన్య నాగళ్ల కూడా ఇలాంటి ఓ ప్రశ్నను అడిగారు ఓ జర్నలిస్ట్‌. వాటి వివరాల్లోకి వెళితే... 

జర్నలిస్ట్‌: తెలుగుమ్మాయిలు సినీ పరిశ్రమకు రావాలంటే చాలా భయపడతారు. దానికి కారణం క్యాస్టింగ్‌ కౌచ్‌. ఇది వాస్తవం. సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా, నటిగా అవకాశం రావాలంటే ఫస్ట్‌ కమిట్‌మెంట్‌ అడుగుతారు. వేరే ఇండస్ట్రీలో అలా అడగరు. మీరు చేసే సైన్‌ అగ్రిమెంట్‌లో కూడా కమిట్‌ మెంట్‌ ఉంటుందా? కమిట్‌మెంట్‌ ఇస్తే ఒక రెమ్యూనరేషన్, ఇవ్వకపోతే మరో రెమ్యూనరేషన్‌ ఉంటుందట కదా.. నిజమేనా? 

అనన్య నాగళ్ల:  మీరు ఇంత హండ్రెడ్‌ పర్సెంట్‌ కన్‌ఫర్మ్‌గా ఎలా అడుగుతారు? మీరు అడిగేది చాలా రాంగ్‌. ఏ పరిశ్రమలో అయినా నెగెటివ్, పాజిటివ్‌ రెండూ ఉంటాయి. కానీ అందరూ నెగెటివ్‌నే తీసుకుంటారు. కానీ మీరు అనుకున్నట్లుగా సినీ పరిశ్రమలో అలా ఉండదు. నాకు ఇప్పటి వరకు ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. అవకాశం ఇచ్చే ముందు కమిట్‌మెంట్‌ అడగటం అనేది హాండ్రెడ్‌ పర్సెంట్‌ రాంగ్‌. నేను అనుభవంతో చెబుతున్నా.. మీరు అనుకుంటున్నవిషయం రాంగ్‌. 

పొట్టేల్ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో జరిగిన క్యూ అండ్‌ ఏ సెషన్‌ (క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్) లో అనన్య నాగళ్లకు ఈ ప్రశ్న ఎదురైంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 
Ananya Nagalla
Pottel
Pottel pressmeet
Pottel trailer
Casting Couch
Ananya Nagalla answer to journalist

More Telugu News