Virat Kohli: బెంగళూరు టెస్టు ద్వారా మరో ఘనత అందుకున్న కోహ్లీ
- బెంగళూరులో టీమిండియా, న్యూజిలాండ్ టెస్టు
- రెండో ఇన్నింగ్స్ లో 70 పరుగులు చేసిన కోహ్లీ
- ఈ క్రమంలో టెస్టుల్లో 9,000 పరుగులు పూర్తి
- ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్ మన్ గా కోహ్లీ ఘనత
టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్ లో మరో ఘనత అందుకున్నాడు. టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. బెంగళూరులో న్యూజిలాండ్ తో టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ 70 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 9 వేల మార్కును చేరుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్ మన్ గా రికార్డు పుటల్లోకెక్కాడు.
టెస్టుల్లో 9 వేల పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో అందనంత ఎత్తులో నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో రాహుల్ ద్రావిడ్ (13,265), మూడో స్థానంలో సునీల్ గవాస్కర్ (10,122) ఉన్నారు. ఇప్పుడు వారి సరసన కోహ్లీ కూడా చేరాడు. 9 వేల పరుగులు సాధించేందుకు కోహ్లీకి 197 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.