MVV Satyanarayana: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన స్థలాల్లో సోదాలపై ఈడీ ప్రకటన
- ఇటీవల విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీకి చెందిన స్థలాల్లో ఈడీ సోదాలు
- ఐదు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామన్న ఈడీ
- రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై వివరణ
ఇటీవల విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన స్థలాల్లో ఈడీ దాడులు చేపట్టడం తెలిసిందే. ఈ సోదాలపై ఈడీ నేడు ప్రకటన చేసింది. అక్టోబరు 19వ తేదీన విశాఖలోని ఐదు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలపై ఈ సోదాలు చేపట్టినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వివరించింది.
రూ.200 కోట్ల విలువైన 12.51 ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొంది. వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందని, ఆ భూమిని మోసపూరితంగా అన్యాక్రాంతం చేశారని ఈడీ వివరించింది. అరిలోవ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది.