Rajamouli: మహేశ్ బాబు సినిమా కోసం విద్యార్థిగా మారిపోయిన రాజమౌళి
- మహేశ్ బాబు సినిమాలోనూ జంతువులు ఉంటాయన్న రాజమౌళి
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోనున్న దర్శక ధీరుడు
- రెండు భాగాలుగా మహేశ్ సినిమా
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రపసాద్ కథను అందిస్తున్నారు. ప్రస్తుతం టీమ్ అంతా ఈ చిత్రం పైనే కసరత్తులు చేస్తోంది.
ఇక ఈ చిత్రం గురించి ఏ అప్డేట్ వచ్చినా సోషల్‌మీడియాలో అది వైరల్‌గా మారుతుంది. ఈ తరుణంలోనే దర్శకుడు రాజమౌళి ఓ ఆస్తకికర విషయాన్ని తెలిపారు. ఇటీవల ఓ నేషనల్ స్థాయి ఈవెంట్ హాజరైన రాజమౌళి ఎస్ఎస్ఎంబీ సినిమా గురించి కొత్త అప్డేట్ను ఇచ్చారు.
''నాకు జంతువులంటే ఎంతో ఇష్టం. ఆర్ఆర్ఆర్తో పాటు నా గత అన్ని సినిమాల్లో జంతువులను ఉపయోగించాను. మగధీర, యమదొంగ, బాహుబలి, చిత్రాల్లో కూడా జంతువులు ఉంటాయి. ఇక నేను మహేశ్ బాబుతో తెరకెక్కించబోయే చిత్రంలో కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంలో కంటే ఎక్కువగా జంతువులు కనిపిస్తాయి" అన్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ చిత్రంకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా విజువల్ ఫీస్ట్‌లా ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఆర్టిఫిషియాల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోనున్నారట. ఇందుకు సంబంధించిన నాలెడ్జ్‌ను పెంచుకోవడానికి, పలు విషయాలను అధ్యయనం చేసేందుకు రాజమౌళి విద్యార్థిగా మారిపోయి పలు తరగతులకు హాజరవుతున్నారట. సినిమాలకు విజువల్స్ అందించడంలో పేరు పొందిన ప్రఖ్యాత ఏఐ స్టూడియోలతో కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.
ఇక దర్శక ధీరుడు ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో కొనసాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం కోసం మహేశ్ బాబు పొడవాటి హెయిర్ స్టయిల్, గడ్డంతో కనిపించబోతున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.