BSNL: లోగో మార్చిన బీఎస్ఎన్ఎల్

bsnl has introduced its new logo

  • బీఎస్ఎన్ఎల్ లోగోలో కీలక మార్పులు
  • రెడ్, బ్లూ రంగుల్లో ఉండే వక్ర రేఖలను ఆకుపచ్చ, తెలుపు రంగులలోకి మార్పు
  • గ్లోబ్ ఆకారంలో కాషాయ రంగులో భారత చిత్రపటం
  • క్యాప్షన్‌లో కనెక్టింగ్ ఇండియా బదులుగా కనెక్టింగ్ భారత్‌గా మార్పు

 
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన లోగోలో కీలక మార్పులు చేసింది. వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పాత లోగోను మార్పులు చేసింది. జియో, ఎయిర్ టెల్, వీ వంటి ప్రైవేటు రంగ టెలికం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ రేట్‌లను పెంచిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఆ సంస్థల వినియోగదారులు (యూజర్లు) బీఎస్ఎన్ఎల్‌లోకి పోర్టు అయ్యారు. 

ఇదే క్రమంలో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా సంస్థ అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా 4జీ నెట్ వర్క్ విస్తరణ, 5జీ ప్రారంభానికి ముందు బీఎస్ఎన్ఎల్ .. లోగోలో కీలక మార్పులు చేసి వినియోగదారుల ముందుకు వచ్చింది. బీఎస్ఎన్ఎల్ లోగోలో ఇంతకు ముందు రెడ్, బ్లూ రంగుల్లో ఉండే వక్ర రేఖలను జాతీయ రంగులను పోలిన ఆకుపచ్చ, తెలుపు రంగులోకి మార్చింది. 

అంతే కాకుండా భారతదేశ చిత్ర పటాన్ని కూడా లోగోలో చేర్చింది. కాషాయం రంగులో భారత మ్యాప్ కనిపిస్తోంది. బీఎస్ఎన్ఎల్ .. కనెక్టింగ్ భారత్.. సురక్షితంగా, చౌకగా, విశ్వసనీయంగా అని ఇంగ్లిష్‌లో క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకు ముందు కనెక్టింగ్ ఇండియా అని ఉండగా, ఇప్పుడు దాన్ని కనెక్టింగ్ భారత్‌గా మార్చింది.  
 
కాగా, బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 4జీ సేవలను దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెట్‌వర్క్‌ను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఖాతాదారులకు మరింత చేరువ అవ్వడమే టార్గెట్‌గా కొత్త ఫీచర్‌లను అందించడంపై దృష్టి పెట్టింది. స్కామ్‌ల బారిన పడకుండా వినియోగదారులకు రక్షణ ఇచ్చేందుకు ఆటోమేటిక్ ఫిల్టర్ లాంటి ఫీచర్‌లను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా అవసరం లేని మెసేజ్‌లు, కాల్స్‌ను నియంత్రించవచ్చు. వినియోగదారుల ప్రమేయం లేకుండానే నెట్‌వర్క్ వీటిని నియంత్రిస్తుంది. ఇక 5జీ నెట్‌వర్క్‌ను అందించడానికి సీ - డాక్ తో బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.   

  • Loading...

More Telugu News