Singareni Collieries Company: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Singareni workers to get about rs 94K as Deepavali bonus
  • దీపావళి బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడి
  • ఒక్కో కార్మికుడి ఖాతాలో రూ.93,750 జమ చేయనున్న సింగరేణి సంస్థ
  • 40 వేల మంది కార్మికుల ఖాతాల్లో రేపటి వరకు నగదు జమ
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ కింద రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. రేపు మధ్యాహ్నం లోగా 40 వేల మంది కార్మికుల ఖాతాల్లో ఈ మొత్తం జమ అవుతాయని వెల్లడించింది. దీపావళి బోనస్ కింద ప్రతి కార్మికుడి ఖాతాలో రూ.93,750 క్రెడిట్ కానుంది.

ఈరోజు సింగరేణిపై సచివాలయంలో జరిగిన సమీక్షలో బోనస్ జారీ చేయాలని ఉపముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది కంటే ఈసారి 50 కోట్ల అదనపు బోనస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

బొగ్గు పరిశ్రమ కోసం జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్‌ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంది. ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా భట్టివిక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. 


ఇటీవలే ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ.796 కోట్లను కంపెనీ పంపిణీ చేసినట్లు సింగరేణి సంస్థ సీఎండీ తెలిపారు.
Singareni Collieries Company
Telangana

More Telugu News