Samantha: రెండో పెళ్లి గురించి సమంత షాకింగ్ కామెంట్స్!
- జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించట్లేదన్న సమంత
- ప్రస్తుతం తనకు మరో వ్యక్తి అవసరం లేదని వ్యాఖ్య
- 'సిటాడెల్' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వారి వృత్తిలో బిజీ అయిపోయారు. అయితే, విడాకుల తర్వాత సమంత మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడడంతో కొంతకాలం సినిమాలకు దూరమైంది.
ఈ క్రమంలో ఇటీవల చైతూ రెండో పెళ్లికి రెడీ అయ్యారు. శోభిత ధూళిపాళతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇక ప్రస్తుతం సమంత మళ్లీ నటనలో బిజీ అయ్యారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ' త్వరలోనే విడుదల కానుంది. దాంతో ఆమె వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె తన రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. "నేను ప్రేమించి, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ, ఇప్పుడు విడిపోయాం. అందుకే జీవితంలో రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి అవసరం లేదు. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నా" అని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో సమంత కామెంట్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కాగా, నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'సిటాడెల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీనికి 'ఫ్యామిలీ మ్యాన్-2' ఫేమ్ రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై అంచనాలను పెంచేసింది.