Renu Desai: రేణూ దేశాయ్ ఆనందం... ఎందుకో తెలుసా...?

renu desai started ngo for rescue for dogs

  • మూగ జీవాల కోసం ఎన్జీవోను స్థాపించానన్న రేణూ దేశాయ్
  • 8ఏళ్ల వయసు నుంచి మూగ జీవాలను సంరక్షిస్తున్నానని వెల్లడి
  • మూగ జీవాలపై ఇష్టం ఉండి ఆర్ధిక సాయం చేయాలనుకునే వారు తమ ఎన్జీవోకు విరాళాలు ఇవ్వాలని రేణూ దేశాయ్ వినతి

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిరుచులను నెటిజన్లతో పంచుకునే ప్రముఖ సినీ నటి రేణూ దేశాయ్.. తాజాగా షేర్ చేసిన ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నానని, ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె చెప్పుకొచ్చారు. అసలు రేణూ దేశాయ్ ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటి అంటే.. ఆ వీడియోలో రేణూ దేశాయ్ ఏమని అన్నారో ఒక సారి తెలుసుకుంటే..

ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నానో తనకు మాత్రమే తెలుసునని అన్నారు. తాను ఎనిమిదేళ్ల వయసు నుంచి మూగ జీవాలపై మక్కువతో వాటిని సంరక్షిస్తూ వస్తున్నాను కానీ ఈ విషయం గురించి బయటకు చెప్పాలని, ప్రచారం చేసుకోవాలని ఎప్పుడూ భావించలేదన్నారు. మూగ జీవాలకు ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని వాటి కోసం పెద్దగా మాట్లాడాలని కానీ ఆలోచించలేదన్నారు. అయితే కరోనా సమయంలో మూగ జీవాల  కోసం ఏదైనా చేయాలని తనకు అనిపించిందన్నారు. 

ఆ క్రమంలో వాటి కోసం సొంతంగా ఎన్జీవో స్థాపించాలని తను అనుకున్నానని, ఫైనల్‌గా ఆ కోరిక నేడు నెరవేరిందని చెప్పారు. అందుకు తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తాను ఎన్జీవోను రిజిస్టర్ చేయించానని, మూగ జీవాలపై ఇష్టం ఉండి ఆర్ధిక సాయం చేయాలనుకునే వారు తమ ఎన్జీవోకు విరాళాలు ఇవ్వాలని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూగ జీవాల కోసం ఆమె తీసుకున్న నిర్ణయానికి అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.   


  • Loading...

More Telugu News