Hyderabad: హైదరాబాద్‌లో నెల రోజులు 144 సెక్షన్... ఆ ఒక్కచోటే నిరసనలకు అనుమతి: నగర సీపీ

Hyderabad Police Impose Ban On Gatherings

  • అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు ఆంక్షలు
  • సమావేశాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు
  • ఈ మేరకు నగర సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వుల జారీ

హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించారు. నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్‌లో సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తుల సమావేశం, ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపారు.

బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) కింద హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత నిరసనలు, ధర్నాలకు మాత్రం అనుమతి ఉంటుందని ఆ ఉత్తర్వు పేర్కొంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల అంతటా నిరసన ప్రదర్శనలను నిషేధించినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News