Israel: ఇజ్రాయెల్‌తో యుద్ధం కోరుకోవడం లేదు కానీ.. తగిన శాస్తి తప్పదు.. ఇరాన్ హెచ్చరిక

Appropriate action soon Iran warns Israel

  • టెహ్రాన్‌పై వంద యుద్ధ విమానాలతో బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
  • తమ ప్రజలను, దేశ హక్కులను కాపాడుకుంటామని ఇరాన్ స్పష్టీకరణ
  • ఇజ్రాయెల్ దాడులకు తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందన్న ఇరాన్ అధ్యక్షుడు మసౌద్
  • అమెరికా ఎగదోస్తోందని ఆరోపణ

ఇజ్రాయెల్‌తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కాకపోతే తమపై దాడికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడిచేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్ శనివారం వందకుపైగా యుద్ధ విమానాలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇజ్రాయెల్ దాడిపై తాజాగా ఇరాన్ స్పందించింది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ, తమ పౌరులు, దేశ హక్కులను పరిరక్షించుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడికి తప్పకుండా తగిన ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తన దూకుడు కొనసాగిస్తూ నేరాలకు పాల్పడితే ఉద్రిక్తతలు పెరుగుతాయని, ఈ నేరాలను అమెరికా ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. 

కాగా, శనివారం తాము ఇరాన్ మిలటరీ లక్ష్యాలపైనే దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. తమ దేశానికి ఏదైనా ముప్పు ఉందని భావిస్తే మిలటరీతోనే దానికి సమాధానం ఇస్తామని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ ద జనరల్ స్టాఫ్ హెర్జీ హలేవి హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News