Ayodhya Ram Mandir: 25 లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య రామాలయం.. అద్భుత వీడియో ఇదిగో

Grand Deepostav celebrations at Ayodhya Ram Temple in Uttarpradesh

  • గిన్నీస్ రికార్డు లక్ష్యంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలు ఏర్పాటు
  • ప్రదర్శనలు నిర్వహించిన ఆరు దేశాలకు చెందిన కళాకారులు
  • ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇదే తొలి దీపోత్సవం

దీపావళి పండగకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దీపోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ (బుధవారం) ఏకంగా 25 లక్షల మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించారు. గిన్నీస్ రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో ఇంత పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించారు. 

దీపోత్సవం వేడుకలతో పవిత్ర అయోధ్య నగరం ఆధ్యాత్మిక, సాంప్రదాయ, సాంస్కృతిక శోభను సంతరించుకుంది. మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కాంబోడియా, ఇండోనేషియా దేశాలకు చెందిన కళాకారులు పలు ఆకట్టుకునే ప్రదర్శనలు చేశారు. రామ్ లీలా ప్రదర్శనతో పాటు పలు ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

కాగా ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీపోత్సవ హారతిని స్వీకరించారు. కళాకారులు ప్రదర్శించిన రథాన్ని కూడా ఆయన లాగారు. కాగా అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇదే తొలి దీపోత్సవం కావడంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News