ap govt: వేద పండితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
- వేద పండితులకు సంభావన పేరుతో నిరుద్యోగ భృతి చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు
- నెలకు రూ.3వేల చొప్పున సంభావన చెల్లింపునకు చర్యలు
- రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది వేదపండితులకు ప్రయోజనం
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వేద పండితులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున సంభావన రూపంలో చెల్లించాలని నిర్ణయించింది.
సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లోని పండితులకు సంభావన పేరుతో నిరుద్యోగ భృతిని ప్రభుత్వం చెల్లించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఆలయాల పరిధిలోని 600 మంది వేద పండితులకు ప్రయోజనం కలగనుంది.