Russia: రష్యాకు బలగాలపై ఉత్తర కొరియాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

US Warns North Korea About Sending Their Forces To Russia
  • రష్యా తరపున పోరాడేందుకు బలగాలు పంపుతున్న నార్త్ కొరియా
  • అదే జరిగితే సైనికుల శవాలు బాడీ బ్యాగుల్లో తిరిగి వస్తాయని అమెరికా హెచ్చరిక
  • ఉక్రెయిన్‌కు మీరు సాయం చేస్తే లేని తప్పు.. తమకు మిత్రదేశాలు చేస్తే తప్పెలా అవుతుందని రష్యా ప్రశ్న
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యాకు సాయంగా తమ బలగాలను పంపుతున్న ఉత్తర కొరియాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బలగాలు పంపించడంపై ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించింది. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా తమ దళాలను పంపిస్తే వారి మృతదేహాలు బాడీ బ్యాగుల్లో తిరిగి వస్తాయని, కాబట్టి ఈ విషయంలో మరోమారు ఆలోచించుకోవాలంటూ ఐక్యరాజ్య సమితిలోని అమెరికా డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరును ప్రస్తావించి మరీ ఈ హెచ్చరికలు జారీ చేశారు.

మీరు చేస్తే ఒప్పు.. మాకు చేస్తే తప్పా?
అమెరికా హెచ్చరికలపై ఐక్యరాజ్య సమితిలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా తీవ్రంగా స్పందించారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు సాయం చేస్తే లేని తప్పు రష్యాకు ఉత్తర కొరియా వంటి మిత్ర దేశాలు సాయం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఉత్తర కొరియాతో రష్యా సైనిక పరస్పర చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించదని పేర్కొన్నారు. తమకు సాయం అందించే హక్కు ఉత్తర కొరియా వంటి మిత్ర దేశాలకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో 2022 నుంచి కిమ్ దళాల ప్రమేయం ఉందన్న వాదనను ఈ సందర్భంగా వాసిలీ ఖండించారు. మరోవైపు, రష్యాకు దళాలు పంపుతున్నట్టు నార్త్ కొరియా ఇప్పటి వరకు అంగీకరించలేదు.
Russia
North Korea
Ukraine War
USA

More Telugu News