Chandrababu: రేపు శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

CM Chandrababu will launch free gas cylinders scheme from Srikakulam district

  • ఎన్నికల వేళ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
  • ఆరు హామీల్లో కీలకంగా ఉన్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం
  • ప్రారంభమైన ఉచిత గ్యాస్ బుకింగ్స్ 
  • నవంబరు 1న ఈదుపురం సభలో పథకం ప్రారంభించనున్న చంద్రబాబు

ఎన్నికల వేళ టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా ఒకటి. ఈ పథకం అమలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు (నవంబరు 1) సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. 

చంద్రబాబు శుక్రవారం నాడు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో పర్యటించనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభ ద్వారా ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడనున్నారు. అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.

కాగా, ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అర్హులైన వారికి ఉచిత గ్యాస్ ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. 

ఇప్పుడు దీపం-2 పథకంలో భాగంగా ఉచిత సిలిండర్లను అందించనున్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పేదలపై గ్యాస్ భారం తగ్గుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను 4 నెలలకు ఒకటి చొప్పున పంపిణీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News