spain: స్పెయిన్ లో వరద బీభత్సం
- 158 మందికి చేరిన ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య
- వాలెన్సియాలోనే 155 మంది మృతి చెందినట్లు గుర్తింపు
- బాధిత పౌరులను హెలికాఫ్టర్లతో ఎయిర్‌లిఫ్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలింపు
స్పెయిన్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం తీవ్ర విషాదాన్ని నింపింది. భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 158కి చేరుకోగా, కేవలం వాలెన్సియాలోనే 155 మంది మృతి చెందినట్లు గుర్తించారు.
అనేక మంది గల్లంతైనట్లు అంచనా. సహాయక బృందాలు అనేక మందిని ఇప్పటికే రక్షించాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్లు, శిథిల భవనాల్లోని మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవనాలు, కార్లపై చిక్కుకున్న పౌరులను హెలికాఫ్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్పెయిన్ రవాణశాఖ మంత్రి అస్కార్ పుయెంటే తెలిపారు.