Merugu Nagarjuna: మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
- వైసీపీ నేతలను వెంటాడుతున్న కేసులు
- మేరుగు నాగార్జున తన నుంచి రూ.90 లక్షలు తీసుకున్నాడన్న మహిళ
- ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకున్నాడని ఫిర్యాదు
- డబ్బులు అడిగితే బెదిరిస్తున్నాడని వెల్లడి
వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది.
ఆ మహిళ స్వస్థలం విజయవాడ. ఇవాళ ఆమె తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజును కలిసి మేరుగు నాగార్జునపై ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే బెదిరించారని వెల్లడించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.