america: ఇరాక్‌కు హెచ్చరికగా అమెరికా కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్‌కు మరింత సైనిక సామగ్రి
- ఇజ్రాయెల్‌కు మరింత సైనిక సామగ్రిని అందిస్తున్నట్లు ప్రకటించిన అమెరికా
- దీర్ఘశ్రేణి బీ – 52 బాంబర్ ఎయిర్ క్రాప్ట్‌లు, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసే మిషన్లు..
- వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలిస్తున్నట్లు తెలిపిన అమెరికా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్న వేళ ఇరాన్‌కు హెచ్చరికగా ఆమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం నుండి మరింత సైనిక సామగ్రిని ఇజ్రాయెల్‌కు తరలిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ పేర్కొన్నారు. ఇరాన్, దాని మద్దతుదారులు ఆమెరికన్ పౌరులను, సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటే .. వారిని రక్షించేందుకు మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని పాట్ రైడర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వచ్చే నెలలో కొత్త ఆయుధాలను తరలించనున్నట్లు తెలిపారు.
తాజాగా తరలిస్తున్న సైనిక సామగ్రిలో దీర్ఘశ్రేణి బీ – 52 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్, బాలిస్టిక్ క్షిపణులను విధ్వంసం చేసే మిషన్లు ఉంటాయని ఆమెరికా తెలిపింది. ఇరాన్‌కు హెచ్చరికగా ఈ సామగ్రిని తరలిస్తున్నట్లు చెప్పింది. కాగా, ఇటీవల టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ బ్యాటరీ (THAAD)తో పాటు సైనిక దళాలను ఇజ్రాయెల్‌కు పంపుతున్నట్లు పెంటగాన్ ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో మరిన్ని ఆయుధాలను తరలించేందుకు సిద్ధమవడం గమనార్హం.
అక్టోబర్ 1న టెల్‌అవీవ్‌పై దాదాపు 200 క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో టెహ్రాన్ కు చెందిన నలుగురు సైనికులు మృతి చెందగా, క్షిపణి తయారీ కేంద్రాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇరాన్ హెచ్చరించింది. ఈ అంశాన్ని తీవ్రతరం చేయవద్దని పలు దేశాలు ఇరాన్‌కు సూచించాయి. ఈ క్రమంలోనే యూఎస్ మరింత ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్‌కు పంపనునట్లు ప్రకటించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యే సూచనలు కనబడుతున్నాయి.