KTR: పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు: కేటీఆర్‌

BRS Working President KTR Criticizes Congress Government

  • ఎక్స్ వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేటీఆర్ విమ‌ర్శ‌లు
  • ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారన్న మాజీ మంత్రి
  • పోరాటం తెలంగాణకు కొత్తకాదని.. ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉంద‌న్న కేటీఆర్‌
  • ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామని వ్యాఖ్య

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరుపై మ‌రోసారి ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయన్నారు. ప్రజాస్వామిక తెలంగాణలో మరోసారి ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెల్లవారే రోజులొచ్చాయని దుయ్య‌బ‌ట్టారు. 

ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. ఇది నియంతృత్వ రాజ్యమని, ప్రభుత్వం నిర్బంధాన్ని నిర్మిస్తుందని ఫైర్ అయ్యారు. హక్కులను అడిగితే బెదిరింపులకు పాల్పడుతారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోరాటం తెలంగాణకు కొత్తకాదని, ఈ మట్టి పొత్తిళ్లలోనే పోరాటం ఉంద‌ని పేర్కొన్నారు. 

ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్ధరణకై పోరాడుతామన్నారు. హైదరాబాద్‌లో 144 సెక్షన్‌ అమలులో ఉండగా, 13 జిల్లాల్లో అధికారికంగా, 20కిపైగా జిల్లాల్లో అనధికారికంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీస్‌ యాక్ట్‌ను అమలు చేస్తోందని దుయ్య‌బ‌ట్టారు. 

  • Loading...

More Telugu News