Vasireddy Padma: మాజీ ఎంపీ గోరంట్ల‌ మాధ‌వ్‌పై వాసిరెడ్డి ప‌ద్మ పోలీసుల‌కు ఫిర్యాదు... కార‌ణ‌మిదే!

Vasireddy Padma Complaint on YSRCP Ex MP Gorantla Madhav
  • అత్యాచార బాధితుల పేర్ల‌ను మాధ‌వ్ వెల్ల‌డిస్తున్నారంటూ గోరంట్ల‌ మాధ‌వ్‌పై ఫిర్యాదు
  • విజ‌య‌వాడ సీపీ రాజశేఖ‌ర్‌బాబుకు ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి ప‌ద్మ
  • రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డంపై త‌న నిర్ణ‌యాన్ని వారంలోగా వెల్ల‌డిస్తాన‌ని వ్యాఖ్య‌
ఇటీవ‌ల వైసీపీ పార్టీని వీడిన ఏపీ మ‌హిళా క‌మిష‌న్ మాజీ ఛైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ... మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్ల‌ను మాధ‌వ్ వెల్ల‌డిస్తున్నార‌ని విజ‌య‌వాడ సీపీ రాజశేఖ‌ర్‌బాబుకు ఇచ్చిన త‌న‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అఘాయిత్యానికి గురైన వారి పేర్ల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌డం దుర్మార్గ‌మ‌ని, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. ఇక తాను రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డంపై త‌న నిర్ణ‌యాన్ని వారంలోగా వెల్ల‌డిస్తాన‌ని వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు. 
Vasireddy Padma
Gorantla Madhav
YSRCP
Andhra Pradesh

More Telugu News