Revanth Reddy: ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
- సీఎం రేవంత్ రెడ్డి నుంచి కీలక ప్రకటన
- బాపూఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం
- ఇక్కడే అత్యంత ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి
తెలంగాణలో అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బాపూఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏపీ సీఎం చంద్రబాబు 1999లో అసెంబ్లీ ముందు 22 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కేరళకు బయలుదేరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు బయలుదేరారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు బయలుదేరారు. ఎర్నాకులంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ కూతురు పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు సీఎంతో సహా వారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు.
అదే సమయంలో, వయనాడ్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ వారు పాల్గొనే అవకాశం ఉంది. వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు.