Mallu Bhatti Vikramarka: ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు కీలకం: భట్టివిక్రమార్క
- ఈరోజు రాంగఢ్ నియోజకవర్గంలో పర్యటించిన భట్టివిక్రమార్క
- దుల్మి, చిత్తార్పూర్, గోలాస్ బ్లాక్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భట్టివిక్రమార్క
- కాంగ్రెస్ గెలుపుతోనే రాజ్యాంగ పరిరక్షణ ఉంటుందన్న డిప్యూటీ సీఎం
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు కీలకమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భట్టి విక్రమార్క ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ఈరోజు ఆయన రాంగఢ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలోని దుల్మి, చిత్తార్పూర్, గోలాస్ బ్లాక్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఝార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలుపుతోనే రాజ్యాంగ పరిరక్షణ ఉంటుందన్నారు. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, భావ ప్రకటన, అవకాశాల్లో కూడా సమానత్వం ఉండాలని రాజ్యాంగం ద్వారా శాసనం రూపొందించుకున్నామన్నారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు.