Rajinikanth: అమరన్ చిత్ర బృందానికి రజనీకాంత్ అభినందనలు

rajinikanth met the team of amaran congratulated sivakarthikeyan and the cast of the film
  • కశ్మీర్ ఉగ్రవాదులను ఎదిరించి వీరమరణం పొందిన తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీ ఆధారంగా రూపొందించిన చిత్రం అమరన్
  • బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న అమరన్
  • చిత్రాన్ని నిర్మించిన కమల్ హాసన్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన రజనీకాంత్
కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఎదిరించి వీరమరణం పొందిన తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీగా తెరకెక్కిన మూవీ 'అమరన్' బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నది. కమల్‌హాసన్ నిర్మించిన ఈ మూవీలో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించారు. ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది. కమల్‌హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్ టైన్ మెంట్ తెరకెక్కించింది. సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ మూవీని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పేరుపై తెలుగులో విడుదల చేశారు. 

ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ని శనివారం హీరో శివకార్తికేయన్, దర్శకుడు రాజ్ కుమార్ పెరస్మా, సినిమాటో గ్రాఫర్ సీహెచ్ సాయి, నిర్మాత ఆర్ మహేంద్రన్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంలో రజనీకాంత్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. 

రజనీకాంత్ ఈ మూవీని ప్రత్యేకంగా వీక్షించి, చిత్రాన్ని నిర్మించిన తన స్నేహితుడు కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి మరీ అభినందించారు. అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారంటూ ప్రశంసించారు. అలాగే హీరో శివకార్తికేయన్, దర్శకుడు రాజ్ కుమార్, నిర్మాత మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయిని ప్రత్యేకంగా అభినందించారు. సినిమా కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్‌ను రజనీకాంత్ మెచ్చుకున్నారు. మూవీ కోసం పడిన కష్టానికి ఫలితం దక్కిందని రజనీకాంత్ అన్నారు.
Rajinikanth
amaran
Movie News
Hero sivakarthikeyan

More Telugu News