Kamala Harris: అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలవాలంటూ తమిళనాడులోని ఓ గ్రామంలో పూజలు... ఎందుకంటే...!

how a tiny south indian village is cheering for kamala harris as she aims for white house

  • తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామంలో కమలా హ్యారిస్ కటౌట్‌లు
  • తులసేంద్రపురం కమలా హ్యారిస్ తల్లి శ్యామల స్వగ్రామం
  • కమలా హ్యారిస్ ను తమ ఊరి ఆడపడుచుగా భావిస్తున్న తులసేంద్రపురం గ్రామస్తుల సందడి

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 5న ప్రధాన ఎన్నిక జరగనున్నది. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచి హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇద్దరి నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం కొనసాగుతోంది. 

ఇదిలా ఉంటే .. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో ఆమెరికా ఎన్నికల కోలాహాలం కనబడుతోంది. తిరువరూర్ జిల్లా తులసేంద్రపురం గ్రామంలో కమలా హ్యారిస్ గెలుపును కాంక్షిస్తూ గ్రామస్తులు పోస్టర్‌లు, కటౌట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఎందుకంటే .. ఇది కమలా హ్యారిస్ పూర్వీకుల గ్రామం. కమలా హ్యారిస్ తల్లి డాక్టర్ శ్యామల స్వగ్రామం తులసేంద్రపురం. ఉన్నత విద్య కోసం ఇక్కడ నుంచి అమెరికా వెళ్లిన శ్యామల..కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎండోక్రైనాలజీలో పీహెచ్‌డీ పట్టా సాధించింది. అదే క్రమంలో జమైకా (బ్రిటీష్) నుండి అమెరికా వచ్చిన ఎకనామిక్స్ విద్యార్ధి డొనాల్డ్ జే హ్యారిస్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహ బంధంతో ఒకటైయ్యారు. 

ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు. శ్యామల, డొనాల్డ్ జే హ్యారిస్ దంపతుల రెండో సంతానం కమలా హ్యారిస్. ఆమెరికాలో పుట్టిపెరిగినా కమలా హ్యారిస్ అమ్మమ్మ గారి ఊరికి అప్పుడప్పుడూ వస్తూ వెళుతుండటంతో తులసేంద్రపురం గ్రామస్తులతో అనుబంధం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు తమ ఊరి ఆడపడుచు కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందాలని కోరుతూ గ్రామంలోని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News