ap minister: పేద వర్గాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వంద గజాల లోపు ఇళ్లకు ప్లాన్ అప్రూవల్ అవసరం లేదు: మంత్రి నారాయణ

no permission needed to construct a house below 100 yards in ap cities

  • వంద గజాల్లోపు ఇళ్లకు ప్లాన్ మంజూరు అవసరం లేదని చెప్పిన మంత్రి నారాయణ
  • విశాఖలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
  • 300 గజాలలోపు గృహాలకు సులువుగా అనుమతులు ఇచ్చేలా ప్రణాళికలు

పేద గృహ నిర్మాణదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నగరాల్లో నిర్మించే వంద గజాల్లోపు గృహాలకు ప్లాన్ మంజూరు ప్రక్రియను ప్రభుత్వం మినహాయించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించారు. అంటే రెండు సెంట్ల లోపు ఇళ్ల నిర్మాణం చేసుకునే వారు ప్లాన్ మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. శనివారం ఆయన విశాఖ జిల్లా ఇన్ చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్‌తో కలిసి జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  

పేద, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను తొలగించేలా భవన నిర్మాణ అనుమతుల విధానాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. 300 గజాల్లోపు గృహాలకు ఈజీగా ప్లాన్ అప్రూవల్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. వివిధ అంశాలపై అధికారులతో మంత్రి చర్చించి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్, వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

  • Loading...

More Telugu News