Rashmika Mandanna: బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ కు రష్మిక సూచన

Rashmika gives advise to Kidambi Srikanth

  • త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కిదాంబి శ్రీకాంత్, శ్రావ్య వర్మ
  • టాలీవుడ్ స్టయిలిస్ట్ గా ఫేమస్ అయిన శ్రావ్య వర్మ
  • శ్రావ్య వర్మను బాగా చూసుకోవాలంటూ కిదాంబికి రష్మిక అడ్వైజ్

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ కు అందాల నటి రష్మిక మందన్న ఆసక్తికర సూచన చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే... కిదాంబి శ్రీకాంత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టాలీవుడ్ స్టయిలిస్ట్ శ్రావ్య వర్మను శ్రీకాంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. 

ఈ నేపథ్యంలో, టాలీవుడ్ ఇండస్ట్రీలోని తన ఫ్రెండ్స్ కు శ్రావ్య వర్మ బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి రష్మిక, వర్ష బొల్లమ్మ వంటి హీరోయిన్లు హాజరయ్యారు. శ్రావ్య వర్మ ఈ బ్యాచిలర్ పార్టీపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా, రష్మిక స్పందించింది. 

కిదాంబి శ్రీకాంత్... ఇక నుంచి శ్రావ్య వర్మ నీది... ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి... అంటూ రష్మిక సూచించింది. అందుకు కిదాంబి శ్రీకాంత్ కూడా రిప్లయ్ ఇచ్చాడు. శ్రావ్య వర్మను మహారాణిలా చూసుకుంటానని తెలిపాడు. 

శ్రావ్య వర్మ ఎవరో కాదు... దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు. టాలీవుడ్ లో పలువురు హీరోలకు ఆమె స్టయిలిస్ట్ గా పనిచేసింది. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన గుడ్ లక్ సఖి చిత్రానికి శ్రావ్య వర్మ కో ప్రొడ్యూసర్ గానూ వ్యవహరించింది.

  • Loading...

More Telugu News