Harris and Trump: రేపే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు.. ట్రంప్‌, క‌మ‌ల మ‌ధ్య హోరాహోరీ పోరు

Tight Race in Swing States Between Kamala Harris and Donald Trump

  • మ‌రికొన్ని గంట‌ల్లో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు
  • ఇవాళ్టి రాత్రితో ముగియ‌నున్న ఎన్నిక‌ల‌ ప్ర‌చారం  
  • అగ్ర‌రాజ్యంలో దాదాపు 24.4కోట్ల మంది ఓట‌ర్లు
  • ముంద‌స్తు ఓటింగ్‌లో ఇప్ప‌టికే ఓటేసిన 7.5 కోట్ల మంది
  • ట్రంప్‌, క‌మ‌ల మ‌ధ్య పోటాపోటీ ఖాయ‌మ‌న్న స‌ర్వేలు
  • స్వింగ్ స్టేట్స్‌లోనూ ఇద్ద‌రి మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంద‌న్న‌ ఒపీనియ‌న్ పోల్స్

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు మ‌రికొన్ని గంట‌లే మిగిలాయి. ప్ర‌పంచ‌మంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది. అగ్ర‌రాజ్యంలో దాదాపు 24.4 కోట్ల మంది ఓట‌ర్లు ఉండ‌గా.. ఇప్ప‌టికే ముంద‌స్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల‌ మంది త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇక చివ‌రి వ‌ర‌కు ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్‌, క‌మ‌లా హ్యారిస్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇవాళ రాత్రితో వారి ప్ర‌చారం ముగియ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన స‌ర్వేల‌ను బ‌ట్టి ఇరువురి మ‌ధ్య హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌ని తేలింది. 

కాగా, అధ్యక్షుడి ఎన్నిక‌కు కీల‌కంగా భావించే స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్‌, క‌మ‌ల మధ్య నువ్వా? నేనా? అన్న‌ట్టుగా పోటీ ఉన్న‌ట్టు ఒపీనియ‌న్ పోల్స్ లో వెల్ల‌డ‌యింది. ఈ రాష్ట్రాల్లో అక్టోబ‌ర్ 24 నుంచి న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు ది న్యూయార్క్ టైమ్స్‌-సైనా పోల్స్ స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో విస్కాన్సిన్‌, నార్త్ క‌రోలినా, నెవెడాలో క‌మ‌లకు మ‌ద్ద‌తు ఉంటే.. అరిజోనాలో ట్రంప్‌వైపు ఓట్ల‌రు మొగ్గ‌చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే పెన్సిల్వేయా, జార్జియా, మిషిగ‌న్‌లో ఇరువురు అభ్య‌ర్థుల మ‌ధ్య తీవ్ర పోటీ ఉన్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌ధాన పోటీ డెమోక్రాట్ అభ్య‌ర్థి క‌మ‌లా హ్యారిస్, రిప‌బ్లికన్ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ మ‌ధ్యే ఉన్నా.. వీరితో పాటు కొంత‌మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. రాబర్ట్ ఎఫ్ కెన్న‌డీ జూనియ‌ర్‌, కార్నెల్ వేస్ట్‌లు ఇండిపెండెంట్స్‌గా బ‌రిలో ఉంటే.. లిబ‌ర్టేరియ‌న్ పార్టీ నుంచి చేజ్ ఓలివ‌ర్, గ్రీన్‌పార్టీ నుంచి జిల్ స్టీన్ పోటీలో ఉన్నారు.  

  • Loading...

More Telugu News