Telangana TET: నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్.. ఏడాదిలో రెండోసారి

Telangana government today to issue TET notification

  • ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామన్న ప్రభుత్వం
  • ఈ ఏడాది మేలో నిర్వహించిన టెట్‌కు 2.35 లక్షల మంది హాజరు
  • జనవరిలో పరీక్షలు ఉండే అవకాశం
  • టెట్-1 పేపర్‌కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ  పూర్తిచేసిన వారు అర్హులు

ఏటా రెండుసార్లు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహిస్తామన్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే నేడు మరోమారు నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరిలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, ఈ పరీక్షలు సంక్రాంతి లోపా, తర్వాతా? అన్న విషయంలో స్పష్టత లేదు. పరీక్షల కోసం వారం, పది రోజులపాటు స్లాట్లు అవసరం. ఈ నేపథ్యంలో అవి దొరికే సౌలభ్యాన్ని బట్టి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మేలో నిర్వహించిన టెట్‌కు 2.35 లక్షల మంది హాజరు కాగా 1.09 లక్షల మంది పాసయ్యారు. ఇక, టెట్-1 పేపర్‌కు డీఈడీ, పేపర్-2కు బీఈడీ  పూర్తిచేసిన వారు అర్హులు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం టెట్ అర్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్ నిర్వహించడం ఇది రెండోసారి.

  • Loading...

More Telugu News