Sea Plane: ఏపీలో పర్యాటక రంగానికి కొంత హంగులు.. విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్

Chandrababu to inaugurate Vijayawada Srisailam seaplane

  • 9న విజయవాడ పున్నమిఘాట్‌లో ప్రారంభించనున్న చంద్రబాబు
  • ప్రయోగం విజయవంతమైతే అందుబాటులోకి రెగ్యులర్ సర్వీసులు
  • 14 సీట్లున్న విమానాన్ని రూపొందించిన ‘డీ హవిల్లాండ్’
  • రెండో దశలో విశాఖ, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాలకు విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగంలో ఇది మరో అద్భుతం. ఈ నెల 9న విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 14 సీట్లున్న ఈ సీప్లేన్‌ను డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పున్నమిఘాట్‌లో దీనిని ప్రారంభిస్తారు. విజయవాడ-శ్రీశైలం మధ్య నడపాలని యోచిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.

సీ ప్లేన్ ప్రయోగం నేపథ్యంలో కృష్ణానదిలోని పున్నమిఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి అధికారులు మెరుగులు దిద్దుతున్నారు. పున్నమిఘాట్ వద్ద బయలుదేరే విమానం శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ల్యాండ్ అవుతుంది. విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, శ్రీశైల మల్లన్న ఆలయ సందర్శనకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేలా దీనిని రూపొందిస్తున్నారు. రెండో దశలో విశాఖ, నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

  • Loading...

More Telugu News