Pakistan: లాహోర్ లో కాలుష్యానికి భారతదేశమే కారణం.. పాక్ వింత వాదన

Pak blames winds from Asr Chd for poor AQI in Lahore
  • పాకిస్థాన్ లోని పంజాబ్ సిటీలో దారుణంగా రికార్డయిన ఏక్యూఐ
  • మన దేశం నుంచి వీచే గాలులతో వాయు కాలుష్యం పెరిగిందని ఆరోపణ
  • ఓ టీవీ ఇంటర్వ్యూలో పాక్ పంజాబ్ మంత్రి విమర్శలు
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని వింత వాదన తెరపైకి తెచ్చింది. ఈమేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. శీతాకాలంలో ఢిల్లీ, హర్యాణా, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) అసాధారణ స్థాయిలో రికార్డవుతుంది. మన దేశంలోనే కాదు పాకిస్థాన్ లోనూ పంజాబ్ రాష్ట్రం ఉంది. అక్కడి లాహోర్ సిటీలో వాయు కాలుష్యం ఇటీవల భారీగా పెరిగింది.

ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లు నమోదైంది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఆదివారం ఓ మీడియాతో మాట్లాడారు. లాహోర్ లో వాయు కాలుష్యం పెరగడానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్ కు చేరుకుని ఏక్యూఐ దారుణంగా పెరిగిందని మండిపడ్డారు. ఆదివారం లాహోర్ లో ఏక్యూఐ 500 పాయింట్లకు కాస్త అటూ ఇటుగా ఉందని మరియం తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. వీచే గాలిని ఆపడం కుదరదని, భారత్ తో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆమె వెల్లడించారు.
Pakistan
Air Pollution
India
Punjab
Lahore
AQI

More Telugu News