Australia: అద్భుతాలు జరిగినా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌కు చోటు కష్టమే!

How can India qualify for WTC final after whitewash in Kiwis hands

  • ఆస్ట్రేలియాపై వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు
  • 62.50 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
  • కివీస్ చేతిలో ఓటమితో రెండో స్థానానికి పరిమితమైన భారత్
  • ఆస్ట్రేలియాను ఆ దేశ గడ్డపై ఓడించడం సులభం కాదంటున్న క్రికెట్ పండితులు

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో దారుణంగా ఓడిన భారత్‌కు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో చోటు క్లిష్టంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతాలు జరిగినా టీమిండియాకు ఫైనల్‌లో చోటు దక్కేలా కనిపించడం లేదు. సొంతగడ్డపై కివీస్ చేతిలో వైట్ వాష్ అయిన భారత్ తాజా ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కిందికి దిగజారింది. 

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న భారత జట్టు.. ఓటమి తర్వాత 58.33 శాతం పాయింట్లతో రెండో స్థానానికి దిగజారింది. ఆస్ట్రేలియా 62.50 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 54.55 శాతం పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.  

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. భారత జట్టు డబ్ల్యూటీసీ భవితవ్యాన్ని నిర్ణయించేది ఈ ట్రోఫీనే.  ఈ ట్రోఫీలో భాగంగా మొత్తం ఐదు టెస్టులు జరగనుండగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ చోటు సంపాదించుకోవాలంటే కనీసం నాలుగు మ్యాచుల్లో విజయం సాధించాలి. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అంత సులభమైన పనేమీ కాదు. కాబట్టి ఏరకంగా చూసినా భారత జట్టుకు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు కష్టంగానే కనిపిస్తోంది. అంతేకాదు, అదే సమయంలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల ఫలితాలపైనా భారత్ అదృష్టం ఆధారపడి ఉంటుంది.

నిజానికి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏకబిగిన నాలుగు టెస్టులు గెలవడం దాదాపు అసాధ్యమని క్రికెట్ పండితులు చెబుతున్నారు. 2018-19, 2020-21 సీజన్లలో ఆస్ట్రేలియాపై రెండేసి విజయాలతో భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 10 సార్లు సొంతం చేసుకుంటే, ఆస్ట్రేలియా ఐదుసార్లు గెలిచింది. 2014-15 సీజన్‌లో ఆస్ట్రేలియా చివరిసారి ఈ సిరీస్‌ను గెలుచుకోగా, 2004-05లో చివరిసారి భారత గడ్డపై సిరీస్ అందుకుంది. 

  • Loading...

More Telugu News