Chandrababu: దేశంలోనే నెంబర్ వన్ గా ఏపీ నూతన క్రీడా పాలసీ: సీఎం చంద్రబాబు

CM Chandrababu reviews on New Sports Policy

  • క్రీడలపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు
  • అందరికీ క్రీడలు అనే కాన్సెప్టుతో స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన
  • గ్రామస్థాయి నుంచి క్రీడా వికాసానికి ప్రణాళిక 

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తోన్న స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ స్పోర్ట్స్ నూతన పాలసీ ఉంటుందని సీఎం అన్నారు. అందరికీ క్రీడలు అనే కాన్సెప్టుతో రూపొందించిన పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. 

రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ తో కూడిన పాలసీని సిద్ధం చేశారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకో సిస్టం, గ్లోబల్ విజిబిలిటీ అనే అంశాల ప్రాతిపదికగా పాలసీని రూపొందించారు. 

ఈ నాలుగు మిషన్ ఆబ్జెక్ట్స్ లో అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్స్ట్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. 

ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల కంటే మెరుగైన అంశాలను చేర్చారు. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారు. 

  • Loading...

More Telugu News