Siddaramaiah: ముడా కేసులో సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసులు

Lokayukta summons Siddaramaiah to appear for questioning on Nov 6

  • ఈ కేసులో 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు
  • నోటీసులు వచ్చినట్లు వెల్లడించిన సిద్ధరామయ్య
  • ఇప్పటికే సిద్ధూ భార్య పార్వతిని విచారించిన పోలీసులు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లోకాయుక్త నోటీసులు ఇచ్చింది. ముడా (మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కుంభకోణం కేసులో ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. తనకు లోకాయుక్త పోలీసుల నుంచి నోటీసులు అందినట్లు సీఎం సిద్ధరామయ్య కూడా వెల్లడించారు.

తాను నవంబర్ 6న లోకాయుక్త పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతానన్నారు. ఈ కేసులో ఆయన భార్య పార్వతిని లోకాయుక్త పోలీసులు అక్టోబర్ 25న ప్రశ్నించారు. 

బుధవారం ఉదయం లోకాయుక్త ఎదుట హాజరు కావాలని నోటీసులు ఇచ్చామని లోకాయుక్త సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు కొంత భూమిని కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Loading...

More Telugu News