Jaishankar: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు... జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Jaishankar on US presidential results

  • ఎవరు ఎన్నికైనా అమెరికా ప్రయోజనాల కోసమే పని చేస్తారన్న జైశంకర్
  • అమెరికా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుందని అభిప్రాయపడిన జైశంకర్
  • ఈ విషయంలో ట్రంప్ మరింత స్పష్టంగా భావవ్యక్తీకరణతో ఉండవచ్చునని వ్యాఖ్య

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో జైశంకర్ మాట్లాడుతూ... అగ్రరాజ్యానికి తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్ లేదా కమలాహారిస్‌లో ఎవరు ఎన్నికైనా అమెరికా ప్రయోజనాల కోసమే పని చేస్తారని వెల్లడించారు. అమెరికా ఎన్నికల ఫలితాలు... దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపించవన్నారు.

అభ్యర్థుల అభిప్రాయాలు ప్రజల ప్రాధాన్యతలకు భిన్నంగా ఉంటాయన్నారు. ఇది బహుశా ఒబామా హయాం నుంచి ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. అమెరికా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుందని... ఆ విషయంలో ట్రంప్ మరింత స్పష్టంగా భావవ్యక్తీకరణతో ఉండవచ్చునన్నారు. ఈ ఎన్నికల తర్వాత అమెరికా నుంచి అందుతున్న దాతృత్వం కొనసాగే అవకాశాలు తగ్గుతాయని, కాబట్టి ప్రపంచం అందుకు సిద్ధపడాలన్నారు.

  • Loading...

More Telugu News