Ananya Nagalla: నేను వేణుస్వామిని కలవడానికి కారణం ఇదే: హీరోయిన్ అనన్య నాగళ్ల

Ananya Nagalla reveals the reason of meeting Venu Swamy
  • సినిమా ప్రమోషన్ కోసమే వేణు స్వామిని కలిశానన్న అనన్య
  • తాను జాతకాలను పట్టించుకోనని వెల్లడి
  • ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలని వ్యాఖ్య
టాలీవుడ్ లో అచ్చమైన తెలుగు హీరోయిన్లలో అనన్య నాగళ్ల ఒకరు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనన్య తన తొలి సినిమా 'మల్లేశం'తోనే సక్సెస్ ను అందుకుంది. పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మంచి గుర్తింపును తెచ్చుకున్న అనన్య... తన తాజా చిత్రం 'పొట్టేల్'తో మరో సక్సెస్ ను సాధించింది. 

మరోవైపు, 'పొట్టేల్' సినిమాకు ముందు 'తంత్రం' అనే ఓ హారర్ సినిమాలో అనన్య నటించింది. ఈ సినిమా విడుదల సమయంలో జ్యోతిష్యుడు వేణు స్వామిని ఆమె కలవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయనను కలవడానికి గల కారణాలను తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 

ఇప్పటి వరకు తాను ఎవరితోనూ జాతకాలు చెప్పించుకోలేదని అనన్య తెలిపారు. చిన్నప్పటి నుంచి తాను జాతకాలను పట్టించుకోలేదని చెప్పారు. తన సినిమా ప్రమోషన్ లో భాగంగానే వేణు స్వామిని కలవడం జరిగిందని, అంతకుమించి ఏమీ లేదని స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలని చెప్పారు.
Ananya Nagalla
Tollywood
Venu Swamy

More Telugu News