Donald Trump: 131 ఏళ్ల తర్వాత... డొనాల్డ్ ట్రంప్ అరుదైన రికార్డ్
- అధ్యక్షుడిగా ఓడిపోయి... ఆ తర్వాత విజయం సాధించిన ట్రంప్
- కమలాహారిస్‌పై విజయం దిశగా డొనాల్డ్ ట్రంప్
- 1892లో ఇలా మొదటిసారి గెలిచిన గ్రోవర్ క్లీవ్‌లాండ్
అమెరికా ఎన్నికల చరిత్రలో.. ఓ అధ్యక్షుడు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయి... ఆ తర్వాత శ్వేతసౌధాన్ని తిరిగి గెలుచుకోవడం ఇది రెండోసారి. 131 ఏళ్ల తర్వాత డొనాల్డ్ ట్రంప్ అరుదైన రికార్డ్‌ను సృష్టించాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచిన వారు ఉన్నారు. కానీ ఓసారి పదవిని చేపట్టాక... రెండోసారి ఓడిపోయి... మూడో ఎన్నికల్లో గెలవడం రెండోసారి.
2020లో జోబైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్ ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌పై ఘన విజయం సాధించారు. ట్రంప్ మొదటిసారి హిల్లరీ క్లింటన్‌పై గెలిచి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు.
డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు గ్రోవర్ క్లీవ్‌లాండ్ మాత్రమే ఇలా రెండుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలుత 1884లో గెలిచిన ఆయన 1888లో ఓటమి చెందారు. ఆ తర్వాత 1892 ఎన్నికల్లో గెలుపొందారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ట్రంప్ ఆ రికార్డ్ సృష్టించారు.