Srinu Vaitla: ఆ సినిమాతో ఇక వెనుదిరిగి చూసుకోలేదన్న శ్రీను వైట్ల!

Srinu Vaitla Interview
  • పాతికేళ్లకు దగ్గరలో 'నీ కోసం'
  • రూ.38 లక్షల్లో పూర్తి చేశామన్న శ్రీను వైట్ల 
  • 'ఆనందం'తో కెరియర్ ఊపందుకుందని వెల్లడి 
  • కెరియర్ హ్యాపీగానే ఉందని వ్యాఖ్య    

శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఫస్టు మూవీ 'నీ కోసం'. త్వరలో ఈ సినిమా పాతికేళ్లను పూర్తిచేసుకోనుంది. ఈ నేపథ్యంలో శ్రీను వైట్ల మాట్లాడుతూ... "18 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా ఇండస్ట్రీకి వచ్చాను. మణిరత్నం... పెద్ద వంశీ సినిమాల ప్రభావం నాపై ఎక్కువగా ఉండేది. అందువలన దర్శకుడిని కావాలనే ఆలోచనతోనే వచ్చాను. సినిమాల పట్ల ఉన్న పిచ్చి నన్ను దర్శకుడిని చేసింది" అని అన్నాడు. 

'నీ కోసం' సినిమాను రూ.38 లక్షల్లో తీశాం. ఆ సినిమాను రామోజీరావు గారు రూ.65 లక్షలకు కొనేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాను చూసిన రామోజీరావుగారు, నా డైరెక్షన్ నచ్చిందని చెప్పారు. తప్పకుండా నాకు ఒక ఛాన్స్ ఇస్తానని అన్నారు. అలా నేను ఆ బ్యానర్లో  'ఆనందం' సినిమాను చేశాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తరువాత ఇక కెరియర్ పరంగా నేను వెనుదిరిగి చూసుకోలేదు" అని అన్నాడు. 

"25 ఏళ్ల కెరియర్లో ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే, దర్శకుడిని కావాలనే పట్టుదలతో నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపిస్తోంది. 25 ఏళ్ల కెరియర్లో నేను 'విశ్వం' వంటి హిట్ ను కలిగి ఉండటం గొప్ప విషయంగా భావిస్తాను. వివాదాలు... విమర్శలు పెద్దగా లేకుండా ఇంతదూరం ప్రయాణించడం హ్యాపీగా అనిపిస్తోంది" అని చెప్పాడు. 

Srinu Vaitla
Director
Nee kosam
Aanandam Movie

More Telugu News