Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ ను అభినందించిన ఇతర మంత్రులు

Fellow ministers congratulates minister Nara Lokesh for his successful in US Tour
  • ఇటీవల అమెరికాలో లోకేశ్ పర్యటన
  • లోకేశ్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయిందన్న మంత్రులు
  • లోకేశ్ అలుపెరుగని కృషి చేశారని కితాబు 
ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ఇవాళ ఇతర మంత్రులు అభినందనలు తెలియజేశారు. ఏపీ కేబినెట్ మంత్రులు ఉండవల్లిలోని లోకేశ్ నివాసానికి వచ్చారు. లోకేశ్ ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. 

అమెరికాలో వారం రోజుల పాటు సాగించిన పెట్టుబడుల యాత్రను లోకేశ్ గ్రాండ్ సక్సెస్ చేశారని మంత్రులు కొనియాడారు. ఏపీకి పెట్టుబడులు రాబట్టేందుకు, పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించేందుకు లోకేశ్ అలుపెరుగని కృషి చేశారని అభినందించారు.

నారా లోకేశ్ అమెరికా పర్యటనలో వరుస భేటీలతో ఫుల్ బిజీగా గడిపారు. దాదాపు 100 కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించారు. 

ఏపీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉందని లోకేశ్ వారికి తెలియజేశారు. భారత్ లోనే బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీని ఏపీలో అమలు చేస్తున్నామని వారికి స్పష్టం చేశారు.
Nara Lokesh
US Tour
Ministers
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News