Revanth Reddy: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- సచివాలయం నుంచి రాజ్ భవన్ చేరుకున్న సీఎం
- కులగణనకు సంబంధించిన అంశాలపై వివరించిన సీఎం
- తన సోదరుడి కూతురు వివాహానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌లో కలిశారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. వారు సచివాలయం నుంచి నేరుగా రాజ్ భవన్ చేరుకున్నారు. కులగణనకు సంబంధించి వివిధ అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించారు.
కులగణనతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని గవర్నర్‌కు తెలిపారు. ఈ సమగ్ర సర్వేను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అదే సమయంలో తన సోదరుడి కుమార్తె వివాహానికి కూడా గవర్నర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
గవర్నర్‌ను కలిసిన వారిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీలు బలరాం నాయక్, కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్ భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు ఉన్నారు.