Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

IMD Warns Heavy Rains In Andhra And Tamil Nadu Next Four Days

  • నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
  • తమిళనాడుకు తుపాను ముప్పు
  • మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

అలాగే, తమిళనాడుకు తుపాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురానికి ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. 

తమిళనాడులోని 19 జిల్లాల్లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News