Graduate MLC Elections: వైసీపీ సంచలన నిర్ణయం... ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం
- కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం లేదన్న పేర్ని నాని
- అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటన
ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశం కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. ఓటర్లు ప్రశాంతంగా బయటికి వచ్చి ఓటేసే పరిస్థితి లేదని అన్నారు.
ఏపీలో అప్రజాస్వామిక పాలన నెలకొందని, కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయరాదని వైసీపీ నిర్ణయించుకుందని పేర్ని నాని స్పష్టం చేశారు.