Champions Trophy 2025: బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గిన పాక్... చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్ లు యూఏఈలో!

champions trophy india likely to play in uae pcb ready for hybrid model

  • ఛాంపియన్ ట్రోఫీ అతిధ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 
  • తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించిన పీసీబీ 
  • షెడ్యూల్‌లో స్వల్ప మార్పులకు సిద్ధమవుతున్న పీసీబీ

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) ఆతిధ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే తాత్కాలిక షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించింది. మార్చి 1న లాహోర్‌లో భారత్ – పాకిస్థాన్ మ్యాచ్, మార్చి 9న లోహార్ లోనే ఫైనల్ మ్యాచ్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించింది. 

అయితే భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే టీమ్ ఇండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందని బీసీసీఐ తెలిపింది. దీంతో టోర్నీలో భారత్‌ ఆడకపోతే తీవ్రంగా నష్టపోతామని భావించిన పాక్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పాక్‌లో టీమిండియా పర్యటనకు భారత్ సర్కార్ అనుమతించకపోతే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసేందుకు పిసీబీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పీసీబీ విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లుగా పీటీఐ కథనంలో పేర్కొంది. 

ఈ క్రమంలో టోర్నీని హైబ్రీడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఐసీసీ ముందుగానే అప్రమత్తమైంది. భారత జట్టు మ్యాచ్‌లు వేరే దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురైతే అందుకు అవసరమైన నిధులను టోర్నీ బడ్జెట్‌లో కేటాయించింది. ఇంతకు ముందు 2023 అసియా కప్ పాకిస్థాన్‌ వేదికగా జరగాల్సి ఉండగా, హైబ్రిడ్ విధానం అనుసరించి భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు అదే మాదిరిగా యూఏఈలో మ్యాచ్ నిర్వహణకు పీసీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 

  • Loading...

More Telugu News