Varra Ravindra Reddy: ఆంధ్రా-తెలంగాణ బోర్డర్ లో వర్రా రవీంద్రారెడ్డిని పట్టుకున్న పోలీసులు

 Police captured Varra Ravindra Reddy

  • ఇటీవల అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
  • మరో కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లగా... పరారీ
  • నేడు మహబూబ్ నగర్ పరిసరాల్లో పోలీసులకు చిక్కిన రవీంద్రారెడ్డి 

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని నేడు ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, అనితలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్టు వర్రా రవీంద్రారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 

ఇటీవలే వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. అనంతరం, మరో కేసులో అరెస్ట్ చేసేందుకు కడప పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా... అప్పటికే పరారైనట్టు గుర్తించారు. దాంతో, గత కొన్నిరోజులుగా వర్రా రవీంద్రారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

ఇవాళ మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో రవీంద్రారెడ్డి పోలీసులకు చిక్కాడు. వర్రా రవీంద్రారెడ్డి గతంలో విజయమ్మ, షర్మిలపైనా అసభ్యకర పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. కడప, రాజంపేట, మంగళగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News