India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా తొలి టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు... బ్యాటింగ్ ఎవరిదంటే?
భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ షురూ అయింది. టాస్ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్ కు డర్బన్ లోని కింగ్స్ మీడ్ మైదానం వేదిక.
తుది జట్లు ఇవే..
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్.
దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, పాట్రిక్ క్రుగర్, మార్కో యన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్.
సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకోవాలని భావించామని చెప్పాడు. వికెట్ బాగుందని, ప్రాక్టీస్ వికెట్ కంటే మెరుగ్గా కనిపిస్తోందని అన్నాడు. బోర్డుపై మంచి స్కోరు ఉంచడానికి ప్రయత్నిస్తామని సూర్య విశ్వాసం వ్యక్తం చేశాడు. కుర్రాళ్లు తన పనిని సులభం చేస్తున్నారని, తమ ఫ్రాంచైజీలకు దూకుడుగా ఆడిన విధంగానే జట్టులో కూడా ప్రదర్శన చేస్తున్నారని అన్నాడు.