Pawan Kalyan: పాపం... ఆ మహిళా జర్నలిస్టు నలిగిపోతోంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan takes class for journalists on social conscious

  • సామాజిక స్పృహపై పవన్ క్లాస్
  • ఏదైనా ఘటన జరిగితే జనాలు వీడియోలు తీస్తుంటారని వెల్లడి
  • ఘటనలు ఆపేందుకు వెనుకంజ వేస్తుంటారని వివరణ
  • ఈ ధోరణి మారాలని హితవు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని తెలిసిందే. ఆయన ఆలోచనలు దాదాపు సామాజిక దృక్పథంతో కూడుకుని ఉంటాయి. ఇవాళ జర్నలిస్టులతో మాట్లాడుతూ, వారితోనూ సామాజిక స్పృహ గురించే చర్చించారు.

మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి... పాఠశాల స్థాయి నుంచే బాలికలకు ఆత్మరక్షణ శిక్షణ ఇస్తారా? అంటూ ఓ మీడియా రిపోర్టర్ పవన్ ను ప్రశ్నించాడు. అందుకు పవన్ ఆసక్తికరంగా బదులిచ్చారు. 

"మీరు ఇప్పుడు నన్ను ఆత్మరక్షణ గురించి అడిగారు. ఇక్కడ చాలామంది పాత్రికేయులు నన్ను ప్రశ్నలు అడిగేందుకు వచ్చారు... మీ మధ్యలోనే ఇందాకటి నుంచి ఓ మహిళా పాత్రికేయురాలు నలిగిపోతూ ఉంది. మీరు నా నుంచి న్యూస్ బైట్ తీసుకోవాలనే హడావుడిలో ఉన్నారు తప్ప, మీ సాటి మహిళా విలేకరి నలిగిపోతున్న అంశం గుర్తించడంలేదు. 

ఇప్పుడు నేను చెప్పేదేమిటంటే... మొదట మనలోనే సామాజిక స్పృహ ఉండాలి. మన కళ్ల ముందు ఏదైనా ఘటన జరిగినప్పుడు... పోలీసులు వచ్చే లోపు అందరూ ఆ ఘటనను వీడియోలు తీస్తుంటారే తప్ప, వెళ్లి ఆ ఘటనను అడ్డుకోవాలి అనుకోరు. మొదట ఈ విషయంలోనే సామాజిక స్పృహ కలగాలి. సమాజంలో ఈ తరహా ఆలోచనా ధోరణి వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు. 

నేను పనిచేసే షూటింగ్ లలో కూడా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, నేను గుర్తించి చర్యలు తీసుకుంటాను. ఇప్పుడు కూడా మీ మధ్యలో ఓ మహిళా జర్నలిస్టు నలిగిపోతుంటే గుర్తించి, ముందుకు రామ్మా అని చెప్పాను. ఇది కనీస ధర్మం. ప్రతి ఒక్కరూ ఈ గుణాన్ని అలవర్చుకోవాలి. 

కళ్ల ముందు ఆడపిల్లలను ఏడిపిస్తుంటే, చాలామంది చోద్యం చూస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో కల్పించుకుంటే, ఒకవేళ పోలీసులు అండగా ఉండరేమో అని చాలామంది వెనుకంజ వేస్తుంటారు. కానీ, నేను చెప్పేదేమిటంటే... ఇలాంటి ఘటనల్లో మొదటి స్పందించాల్సింది ప్రజలే. ప్రజలే మొదటి రక్షకులు. 

నేను హోంమంత్రి గారికి, డీజీపీ గారికి కూడా చెప్పాను... ఎవరైనా నేరాలపై ఫిర్యాదు చేస్తే వారిని క్రిమినల్స్ లాగా చూడకండి అని చెప్పాను. గత ప్రభుత్వంలాగా మనం వ్యవహరించొద్దు అని కూడా వారికి స్పష్టం చేశాను" అని వివరించారు.

  • Loading...

More Telugu News