TS High Court: ఫిరాయింపుల కేసుపై హైకోర్టులో ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్

Judgement reserved in MLAs defection case

  • సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లిన అసెంబ్లీ కార్యదర్శి
  • అప్పీల్ చేసే అర్హత లేదన్న బీఆర్ఎస్ తరఫు న్యాయవాది
  • వాదనలు ఈరోజుతో ముగిసినట్లు వెల్లడించిన సీజే ధర్మాసనం

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌కు వెళ్లారు. అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేనిదని హైకోర్టుకు తెలిపారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిందేనన్నారు. ఇరువైపుల వాదనలు విన్న సీజే ధర్మాసనం... విచారణ ముగిసిందని తెలిపింది.

కాగా, ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు బెంచ్ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌కు వెళ్లారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు జోక్యం తగదని అప్పీల్ చేశారు.

  • Loading...

More Telugu News