Ravi Shastri: కోహ్లీ గురించి రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ravi shastri backs virat kohli says king returned to his territory comment

  • జట్టులో కీలకంగా మారనున్న సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ
  • కోహ్లీ ఆట తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు 
  • ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ చెలరేగడం ఖాయమంటున్న రవి శాస్త్రి

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన భారత జట్టుకు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ చాలా కీలకంగా మారింది. ఈ ట్రోఫీ ప్రారంభానికి మరో వారమే ఉంది. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడిస్తే తప్ప టీమిండియాకు మరోసారి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ ఆడే అవకాశం లభించదు. అయితే ఈ ట్రోఫీలో విరాట్ కోహ్లీ జట్టుకు కీలకం కానున్నాడు. 

అయితే కోహ్లీ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ ఈ సారి బలహీనంగా ఉన్నాడని ఆసీస్ మాజీ క్రికెటర్లు మైఖేల్ క్లార్క్, రికీ పాంటింగ్ లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అతడి ఆటలో మనుపటి పటిమ తగ్గిందని, ఐదేళ్లలో కేవలం రెండే రెండు సెంచరీలు కొట్టాడంటూ పలు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇలా కోహ్లీ ఆట తీరుపై విమర్శలు వస్తున్న వేళ భారత జట్టు మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. 

వరల్డ్ క్లాస్ బ్యాటర్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై చెలరేగడం ఖాయమని రవి శాస్త్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'రాజు తన సామ్రాజ్యానికి తిరిగొచ్చాడు. విరాట్‌ను విమర్శించే వాళ్లకు నేను చెప్పే మాట ఇదొక్కటే. ఆస్ట్రేలియా గడ్డపై విధ్వంసక ఇన్నింగ్స్‌‌లో రాజు అనే పేరు తెచ్చుకున్నావు. క్రీజులోకి వెళ్లిన ప్రతిసారీ నువ్వు ఒక కింగ్ అనే విషయం నీతో పాటు ప్రత్యర్ధుల మెదళ్లలోనూ తిరుగుతూనే ఉంటుంది' అంటూ కోహ్లీని ఉద్దేశించి రవిశాస్త్రి ట్వీట్ చేశారు.    
 

  • Loading...

More Telugu News