Matka: తొలి రోజు 'మట్కా' వసూళ్లు... వరుణ్‌ కెరీర్‌లోనే అత్యల్ప కలెక్షన్లు!

First day collections of Matka Lowest collections in Varuns career
  • 'మట్కా'  చిత్రానికి డివైడ్‌ టాక్ 
  • వరుణ్‌ కెరీర్‌లోనే అత్యల్ప వసూళ్లు 
  • తొలి రోజు రూ.75 లక్షల కలెక్షన్లు
వరుణ్‌ తేజ్‌ హీరోగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మట్కా'. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో... సినిమా ఓపెనింగ్స్‌ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. 

విడుదలైన తొలి షో నుంచే సినిమాకు నెగెటివ్‌ టాక్‌ రావడంతో చిత్ర ప్రారంభ వసూళ్లపై దాని ప్రభావం పడింది. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.75 లక్షల వసూళ్లను మాత్రమే సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో అత్యధిక బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం తొలిరోజు 1,761 షోలకు ఇంత తక్కువ వసూళ్లు చూసి పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్‌ కూడా ఆశ్చర్యపోతున్నారు.

'గద్దలకొండ గణేష్‌' తరువాత సరైన కమర్షియల్‌ సక్సెస్‌ లేని వరుణ్‌ తేజ్‌ను 'మట్కా' చిత్రం కూడా నిరాశపరిచిందని ఈ కలెక్షన్లు చూస్తే అర్థమవుతుంది. ఓవర్‌సీస్‌లో ఈ చిత్రం అతి తక్కువ ప్రారంభ వసూళ్లను కలెక్ట్‌ చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. వరుణ్‌ తేజ్‌ నటించిన గత చిత్రాలు ఆపరేషన్‌ ఘని, గాండీవదారి అర్జున, ఆపరేషన్‌ వాలంటైన్‌ చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌లుగా నిలిచిన సంగతి తెలిసిందే. 
Matka
Varun Tej
Matka collections
Meenakshi chowdary
Cinema

More Telugu News